విజయవాడ బస్ స్టాండ్ లో తాగు నీటి కి ఉంచిన పంపు దగ్గిర దృశ్యం. నలుగురూ మంచి నీళ్ళు తాగేందుకు ఏర్పాటు చేసారు. అక్కడ తాగటానికి ఉంచిన గ్లాసులకు గోలుసులేసుకోవాల్సిన దురదృష్ట స్థితి మన సమాజానిది. కనీసం నలుగురికీ ఉపయోగపడే చోట, అది కూడా దాహార్తులై వచ్చి మంచినీళ్ళు తాగటానికి వచ్చిన వాళ్ళు ఉపయోగించుకునే గ్లాసులను కూడా వదలకుండా ఎత్తుకుపోవాలని పొంచి ఉన్న వాళ్ళను ఏమనాలి! అలాంటి వాళ్ళను అరికట్టటానికి తాగు నీటికి సంకెళ్ళా!! ఏమి దుస్థితి.
ఇలాంటి దురదృష్ట స్థితి నుంచి మన సమాజం ఎప్పటికి బయటపడుతుంది.

